Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
- రైతు డిక్లరేషన్ రచ్చబండ సభా సమావేశం
నవతెలంగాణ- బంట్వారం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షలు రుణ మాఫీ చేస్తుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రైతు డిక్లరే షన్ రచ్చబండ సభా సమావేశాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వ హించారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ర్యాలీ నిర్వహించి గ్రామంలో వాడ వాడల్లో తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటూ చేసిన రైతు డిక్లరేషన్ రచ్చబండ సభా సమావేశంలో అయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మేలు చేసే పలు సంక్షేమ పథకాలలో వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు. ఏ ఒక్క రైతూ బ్యాంకుల్లో తీసుకున్న వ్యవసాయ రుణాలు తిరిగి కట్టవద్దని అన్నారు. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకూ ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అందిస్తామన్నారు. అసైన్డ్ భూముల రైతులకు క్రయా విక్రయాలతో సహా అన్ని యజ మాన్య హక్కులు కల్పిస్తామన్నారు. నష్టపోయిన పంటలకు నష్టపరిహారం కల్పించి దాంతోపాటు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి పంటలను తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో భూములకు రక్షణ కల్పించేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని తెలిపారు. మహాత్మ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవ సాయానికి అనుసంధానం చేస్తామని తెలిపారు. కౌలు రైతులతో పాటు రైతులందరికీ రైతు బీమా వర్తింపజేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సంతోష రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటేశం, ఎంపీటీసీ పద్మ, కో ఆప్షన్ మెంబెర్ తౌఫిక్ పాషా, రత్నరెడ్డి, అనంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రవీందర్, మొగులయ్య, నర్సింలు, శ్రీకాంత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.