Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ శ్రీధర్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు
నవతెలంగాణ-యాచారం
మండల కేంద్రంలోని యాచారంలో కోతుల బెడద నుంచి ప్రజలను రక్షించాలని గ్రామస్తులు సర్పంచ్ శ్రీధర్ రెడ్డికి, సెక్రెటరీ తిరుపతయ్యకు వినతిపత్రం శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకీ యాచారంలో కోతుల దాడి పెరుగుతుందన్నారు. దీంతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు బయటికి వెళ్లాలంటే కోతుల బెదడతో భయపడుతున్నారని అన్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం ఈ సమస్యపై దృష్టి సారించి కోతుల బెడద నుంచి ప్రజలను రక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో ప్రజలకు వాటి నుంచి పెద్ద తల నొప్పిగా మారిందని తెలియజేశారు. వెంటనే సంబంధిత అధి కారులు కోతులను పట్టుకుని అడవిలో వదిలి వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మస్కు వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ కేశ మౌని దశరథ గౌడ్, గ్రామస్తులు రెడ్డి వెంకట్ రెడ్డి, బుచ్చయ్య గౌడ్, భూతరాజు యాదయ్య, జోగు అంజయ్య, మస్కు ప్రతాప్, మస్కు యాదగిరి, జంగయ్య గౌడ్ పాల్గొన్నారు.