Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్ర కుమార్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
అక్టోబర్ 31న జరిగే సెక్యూరిటీ కార్మికుల ఆలిండియా డిమాండ్స్ డే ను జయప్రదం చేయాలని కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్ర కుమార్ అన్నారు. శుక్రవారం కాటేదాన్లో సెక్యూరిటీ కార్మి కులతో కలిసి ఆయన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రుద్ర కుమార్ మాట్లాడుతూ కాటే దాన్ పారిశ్రామిక ప్రాంతంలో సెక్యూరిటీ కార్మికుల సమస్యలు వర్ణనాతీతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలను పట్టించుకునే నాధుడే లేరన్నారు. ఇటీవల సెక్యూరిటీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం కాటేదాన్ సీఐటీయూ క్లస్టర్ కమిటీ సంప్రదించినట్టు ఆయన స్పష్టం చేశారు. వారి సమస్యలపై టీఐటీయూ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21 విడుదల చేసి అమలు చేయాలని తెలిపారు. సెక్యూరిటీ కార్మికులందరికీ ఎనిమిది గంటల పని దినం, కనీస వేతనం, ఉద్యోగ భద్రత, కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ కార్మికులు వాచ్మెన్లకు, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, ఈఎస్ఐ, పీఎఫ్ బోనస్ తదితర కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెక్యూ రిటీ లేబర్ ఆక్ట్ జీవో ప్రకారం రోజువారి వేతనం అను స్కిల్ వర్కర్ 766 రూపా యలు నుంచి ప్రారంభం కావాలని, కానీ కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో 12 గంటల పని చేయించుకుంటూ కేవలం నెలసరి వేతనం రూ.10 వేల నుంచి రూ.12 వేల లోపు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. కార్మికులందరూ ఏకమై కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో సెక్యూరిటీ సిబ్బందంతా కలిసి,తమ హక్కుల కోసం అక్టోబర్ 31న చలో లేబర్ ఆఫీస్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్ని జయపద్రం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, దశరథ, జాంగిర్, సాంబశివ తదితరులు పాల్గొన్నారు.