Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్ర కుమార్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
ఈ నెల 31న జరిగే సెక్యూరిటీ కార్మికుల ఆల్ ఇండి యా డిమాండ్స్ డేను జయప్రదం చేయాలని కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్ర కుమార్ అన్నారు. శుక్రవారం కాటేదాన్లో సెక్యూరిటీ కార్మికులతో కలిసి ఆయన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో సెక్యూరిటీ కార్మికుల సమస్యలు వర్ణనాతీతమని ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. ఇటీవల సెక్యూరిటీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం కాటేదాన్ సీఐటీయూ క్లస్టర్ కమిటీ సంప్రదించినట్టు తెలిపారు. వారి సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21 విడుదల చేసి అమలు చేయా లన్నారు. సెక్యూరిటీ కార్మికులందరికీ ఎనిమిది గంటల పని దినం, కనీస వేతనం, ఉద్యోగ భద్రత, కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ కార్మికులు వాచ్మెన్ లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ బోనస్ తదితర కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెక్యూ రిటీ లేబర్ ఆక్ట్ జీవో ప్రకారం రోజువారి వేతనం అను స్కిల్ వర్కర్ 766 రూపాయలు నుండి ప్రారంభం కావాలి కానీ కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో 12 గంటల పని చేయించుకుంటూ కేవలం నెలసరి వేతనం పదివేల నుండి 12 వేల లోపు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. తమ హక్కుల కోసం 31న చలో లేబర్ ఆఫీస్ కార్యక్రమంలో కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, దశరథ, జాంగిర్, సాంబశివ తదితరులు పాల్గొన్నారు.