Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీబీ రోగులకు పౌష్టికాహార పదార్థాల కిట్టుల పంపిణీ
- రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర రావు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
టీబీ రోగులు బలవర్థకమైన ఆహారం తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. టీబీ ముక్తు భారత్ అభియాన్ పథకం అమలులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అపోలో టైర్స్ సం యుక్త సౌజన్యంతో శనివారం టీబీ రోగులకు పౌష్టికాహార పదార్థాల కిట్టులు పంపిణీ చేశారు. అపోలో టైర్స్ కో-ఆర్డినేటర్ స్వప్న చేతులు మీదుగా 35 మంది రోగుల కు పోషక విలువలతో కూడిన ఆహారపదార్థాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధి కారి మాట్లాడుతూ టీబీ పేషెంట్లు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి సరఫరా చేయబడిన మందులను సకాలంలో క్రమం తప్పకుండా వేసుకుంటే టీబీ వ్యాధి పూర్తిగా తగ్గుతుందని తెలిపారు. అలాగే పౌష్టికాహారం కూడా తీసుకోవాలని సూచించారు.