Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
తెలంగాణ రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా స్వామిగౌడ్ చరిత్రలో నిలిచిపోతారని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కాటేదాన్‌లోని తన కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. గతంలో శాసనమండలి చైర్మన్‌గా ఉన్న స్వామిగౌడ్ తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని, కేసీఆర్ అహంకారం వలన టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నానని చెప్పినట్టు గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ ఏ విధంగా టీిఆర్‌ఎస్‌లో చేరారని ఆయన ప్రశ్నించారు. ఎంత ప్యాకేజీ తీసుకొని టీఆర్ఎస్కు అమ్ముడు పోయారని మండిపడ్డారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో స్వామిగౌ డ్ వెళ్లినంత మాత్రాన బీజేపీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియో జకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం తెలి పారు. స్వామి గౌడ్ చెబితే ఆయన ఇంట్లో వ్యక్తులే ఓట్లు వే యరు బయట వ్యక్తులు ఎలా వేస్తారని ఎద్దేవా చేశారు. స్వామిగౌడ్ ఎప్పుడూ తన ఉపన్యాసంలో రాజకీయ విలువలు ఉండాలని చెప్పే అతను ఇప్పుడు ఏ విలువల ప్రకారం అతడు టీఆర్ఎస్లో చేరడం జరిగిందో స్పష్టం చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం తమ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయడానికి ఉపయోగించుకుంటున్నా రని స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్య వంతులైన వారని సీఎం కేసీఆర్ చేస్తున్నా నీచ రాజకీయా లు గమనిస్తున్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మంత్రి కేటీఆర్ స్వయంగా బీజేపీ నాయకులకు ఫోన్ చేసి పార్టీకి మద్దతు తెలపాలని అడగడం సిగ్గుచేటని ఆయన అన్నారు.