Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కల్లు కంపోన్ కల్లు తాగి చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుకు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని కోహెడ గ్రామానికి చెందిన చిలుకూరి ప్రవీణ్ (22) పట్నంలో ఓ మటన్ షాప్లో పనిచేస్తున్నాడు. కల్లు కంపొన్లో కల్లు తాగి లక్ష్మి నిలయం టౌన్షిప్ కాలనీలో చెరువులో చాపలు పట్టడానికి వెళ్లి పిడ్స్ రావడంతో చెరువులోనే మృతి చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా మృతదేహాన్ని బయటకి తీశారు. పోస్తుమర్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయలు చెల్లించాలి : సీపీఐ(ఎం) మున్సిపల్ కార్యదర్శి ఎల్లేష
కల్లు తాగి మృతి చెందిన యువకుడు కుటుంబానికి కల్లు కంపోన్ యాజమాన్యం రూ.10 లక్షలు చెల్లించాలని సీపీఐ(ఎం) మున్సిపల్ కార్యదర్శి ఎల్లేష డిమాండ్ చేశారు. కల్లు తాగడం వలన చాలా మంది యువకులు బానిసలుగా తయారవుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు స్పందించి కల్లు కంపొన్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, మత్తు కల్లును అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.