Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలమాకుల చెరువు వద్ద ఘటన
- కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: మృతుడి తండ్రి రాములు
నవతెలంగాణ-శంషాబాద్
కళాశాల నుంచి బయటికి వచ్చిన యువకుడు చెరు వులో అనుమానాస్పదంగా ఆత్మహత్య వేసుకున్న ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. శ్రీధర్ కుమార్ తెలిపిన వివరా ల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని కొండన్నగూడ గ్రామానికి చెందిన నాగి కళ్యాణ్ శంషా బాద్ మండల పరిధిలోని పాలమాకుల గ్రామ రెవెన్యూ పరిధిలోని మైసమ్మ చెరువులో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బాట సింగారం గ్రామ పరిధిలోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో ఉంటూ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతను ఈ నెల 20వ తేదీన ఉదయం 10:30 గంటలకు కాలేజీ నుంచి బయటికి వెళ్ళాడు. మరుసటి రోజు కళాశాలలో లేడని కా లేజీ కొండన్నగూడకు చెందిన కమ్మరి శ్రీరామ్ వాళ్ళ తండ్రి ద్వారా అతని కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ నెల 21న కళాశాలకు వెళ్లిన కళ్యాణ్ కుటుంబ సభ్యులు కళాశాల యజమాన్యాన్ని సంప్రదించారు. అనంతరం భూదాన్ పో చంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళాశాల యాజ మాన్యంతమ కొడుకు ఎప్పుడైనా బయటికి వెళ్లాల్సి వస్తే ఫోన్ ద్వారా అనుమతి తీసుకొని బయటికి పంపించేవారు. కానీ ఈసారి అలా జరగలేదు యాజమాన్యం పొంతన లేని సమాధానాలు చెప్పారు. 22వ తేదీన అతడు కనిపించడం లేదని బంధువుల గ్రామాలలో వెతికారు. ఉదయం 10: 30 గంటలకు పాలమకుల మైసమ్మ చెరువులో శవం కనిపించింది. మృతుని తండ్రి నాగి రాములు పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీశా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కళాశాల యాజమాన్యందే బాధ్యత : మృతుని తండ్రి రాములు
తన కొడుకు 20వ తేదీన కళాశాల నుంచి బయటకు వెళ్లిన రెండు రోజులకు కూడా తన కళాశాల యాజ మాన్యం సమాచారం ఇవ్వలేదు. ఆత్మహత్య ఘటనపై పూర్తి బాధ్యత కళాశాల యాజమాన్యం తీసుకోవాలి. సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి.