Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని భావనారుషి కాలనీలో నెలకొన్న సమస్యలు దశలవారీగా పరిష్క రిస్తానని డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక సమస్యలపై భావనరుషి కాలనీలో జిహెచ్ఎంసి అధికారులతో కలిసి కార్పొ రేటర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా బస్తీలో అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, సీసీరోడ్ల నిర్మాణ పనులు ప్రధానంగా ఉన్నాయన్నారు అనంతరం కార్పొరేటర్ మాట్లాడ ుతూ డివిజన్లో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. కాలనీలో ఉన్న సమస్యల పరిష్కారానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. డివిజన్లో సకాలంలో అభివృద్ధి పనులు పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసు కోవాలన్నారు. డివిజన్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకుని వస్తే, తక్షణం పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, రాజు,చిరంజీవి, పద్మ, దేవీ, ఐలయ్య, అధికారులు బల్వత్ రెడ్డి, వర్క్ఇన్స్పెక్టర్ రాహుల్ పాల్గొన్నారు.