Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
'ఎమ్మెల్సీగా భుజంగరావు అనే నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని' ఎమ్మెల్సీ అభ్యర్థి బీ. భుజంగరావు అన్నారు. ఎస్టీయూటీఎస్ సంఘం రంగారెడ్డి, హైద్రాబాద్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి బి. భుజంగరావు శని వారం శంకర్పల్లి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జన్వాడ, పొద ్దటూర్, టంగుటూరు, కొత్తపల్లి, పర్వేదా, ఆదర్శ పాఠశాల శంకర్‌పల్లిలో ఓటర్ నమోదు, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపి,విద్య వ్యవస్థలో నిలిచిన ప్రమోషన్లు, బదిలీలు వెంటనే చేపట్టడానికి ప్రభుత్వం తరఫున పోరాడ తానన్నారు. పాఠశాలలో స్కావెంజర్లను వెంటనే నియమించాలని అన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరించేం దుకు కృషి చేస్తానని చెప్పారు. పాఠశాల యాజమాన్య ఖాతాలను వెంటనే తెర వాలని, మధ్యాన్న భోజన డబ్బులను పెంచాలని,317 జీవో వల్ల నష్టపోయిన ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు రాజమణి మాట్లాడుతూ 317 జీవో వల్ల ఆడపడుచులు ఎన్నో బాధలకు గురవుతున్నారని దీన్ని వెంటనే ఉపసంహరించి తగు న్యాయం చేయా లన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీగా భుజంగ రావును గెలిపిస్తే ఉపాధ్యాయులకు ప్రతి నెలా ఒకటోవ తేదీన వేతనాలు వచ్చేలా కృషి చేస్తారని తెలిపారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎండి.తాహేర్ అలి మాట్లాడుతూ సీపీఎస్ అనే మహామ్మరిని తొలగించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రాజమణి, ప్రధాన కార్య దర్శి ప్రవీణ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు ఎండీ.తాహేర్ అలి, మొయి నాబాద్ మండల అధ్యక్షులు టోలుకట్ట.బాలరాజు, ఏఐఎస్టిఎఫ్ జాతీయ కార్య దర్శి పరమేశ, శంకర్పల్లి అధ్యక్ష, కార్యదర్శి యాదయ్య, శ్రీనివాస్‌రెడ్డి, నాగేష్, రియాజ్,వివిధ పాఠశాలల ప్రధాన ఉపాద్యాయులు నర్సింగ్ రావు, జంగయ్య, జయసింహా రెడ్డి, మహేశ్వర్‌రావు, సత్యనారాయణ గౌడ్, సిద్దేశ్వర్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు కవిత, ప్రమోదీని, రాధిక, మొగులయ్య పాల్గొన్నారు.