Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చందన్వెళ్లి భూనిర్వాసితుల డిమాండ్
నవతెలంగాణ-షాబాద్
చందన్వెళ్లి భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిం చాలని భూ నిర్వాసితుల అధ్యక్షులు నీరటి అంజన ేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని హైతాబాద్ చౌరస్తాలో దీక్షశిబిరం వద్ద అర్ధనగ ప్రదర్శన చేసి నిసరస తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ..2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతు లకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రజల క్షేమాన్ని ఆకాంక్షించేందుకు తయారు చేసిన చట్టా లను ప్రభుత్వమే తొక్కేయడం భావ్యం కాదన్నారు. జీవించే హక్కు, ప్రశ్నించే హక్కును ఆర్టికల్ 21 ప్రకారం ప్రజలకు రాజ్యాంగం కల్పించిందన్నారు. రైతులు సాగు చేస్తున్నది ప్రభుత్వ భూమి అయిన సంబంధిత రైతుల అనుమతి లేకుండా ఏమీ చేయ కూడదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో భూమి సేకరించాల్సివస్తే అక్కడ మార్కెట్ విలువకు నాలుగు రేట్లు ఎక్కువ చెల్లించాలని చట్టం చెబుతుందన్నారు. నాయకులు, అధికారులు కుమ్మకై రైతులకు అందాల్సిన పరిహారం ఫలహారంగా తిన్నా రని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వా సితుల సంఘం కార్యదర్శి అనంతం, భూ బాధితులు, రైతులు ఉన్నారు.
పరిహారం అందలేదని భూ బాధితురాలు కీర్తన గుండె పోటుతో మృతి
గత 84 రోజుల నుంచి చందన్వెళ్లి భూని ర్వాసితులు నష్ట పరిహారం చెల్లించాలని హైతాబాద్ చౌరస్తాలో రిలే నిరహార దీక్షలు చేస్తుంటే భూ నిర్వసితుల సంఘం సభ్యులు చాకలి వెంకటయ్య. భార్య కీర్తన (32) శనివారం గుండె పోటుతో మృతి చెందింది. బాధితుడు చాకలి వెంకటయ్య తెలిపిన వివరాల మేరకు కీర్తననకు రావల్సిన రెండు ఎకరాల భూమికి డబ్బులు ఎప్పుడు వస్తాయోనని బాధపడుతుండేదని ఆ మనోవేధనతోనే మృతి చెందింది. ఆమెకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని భూ బాధితులు కోరారు.