Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యాన్ అఫ్ ది మ్యాచ్ రాజుధోని 131 నాట్ అవుట్
నవతెలంగాణ-శంషాబాద్
రెండు నెలలుగా నిర్వహించిన ఎంవీఎల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఎఫ్‌సీసీ (ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్) విజేతగా నిలిచింది. శంషాబాద్ మండల పరిధిలోని తొండుపల్లి ఎంవీఎస్ క్రీడా మైదానంలో ఆగస్టు నెల నుంచి అక్టోబర్ 22వ తేదీ వరకు వారాంతపు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో 12 జట్లు పాల్గొన్నాయి. చివరి రోజు శనివారం 20 ఓవర్లతో ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో ఎఫ్‌సీసీ విజరుఆనంద్ స్పార్టాంట్స్ టీమ్‌లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన విజరుఆనంద్ టీం 20 ఓవర్లకు గాను 199 పరుగులు చేసింది. చేదనలో ఎఫ్‌సీసీ కెప్టెన్ టి. కుమార్ గౌడ్ నాయకత్వంలో బరిలోకి దిగిన ఎఫ్‌సీసీ పంజాబ్ టీం కేవలం 14 .1 ఓవర్లలో 203 పరుగులు చేసి విజేతగా నిలిచింది. విజేత జట్టుకు ఎంవీఎల్ క్రికెట్ నిర్వాహక కమిటీ నిర్వాహకులు కప్పు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన విజరు ఆనంద్ టీంకు రన్నర్ కప్పును బహుకరించారు. ఈ టీంలో ముఖ్య భూమిక పోషించిన రాజుధోని 54 బంతుల్లో 131 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. అతనికి నిర్వాహకులు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో సందీప్, రాజుధోని, అభిలాష్, విజరు, దీపక్, సంజరు, అజరు, మల్లేష్, హరి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఆటలాడాలి-ఎఫ్‌సీసీ పంజాబ్ కెప్టెన్ టి.కుమార్
రెండు నెలలుగా జరిగిన సుదీర్ఘ టోర్నమెంట్లో తమ జట్టు కప్పు గెలవడం సంతోషంగా ఉంది. టీం స్పిరిట్‌తో అందరూ తమ శక్తి యుక్తులతో ఫైనల్ గెలుపు కోసం కృషి చేశారు. వారందరికీ ధన్యవాదాలు. యువతకు నచ్చిన ఆట లు తప్పకుండా ఆడాలి. ఆటలతోనే మానసికోల్లాసంతో పాటు, శారీరక దృఢ త్వం పెంపొందుతుంది. సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వస్తాయి. గెలుపోటములను సమానంగా క్రీడా స్ఫూర్తిని చాటాలని పేర్కొన్నారు.