Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ జోడో యాత్రను విజయవంతం చేయండి
- యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ మంజుల దస్తప్ప, సత్యపాల్
నవతెలంగాణ-కొడంగల్
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కన్యా కుమారి నుంచి కాశ్మీర్ వరకూ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా ఈనెల 23న రాష్ట్రంలోని నారాయ ణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభమైన జోడో యాత్ర దీపావళి పండుగ సం ద ర్భంగా విరామం ఇచ్చారు. 27న బొం దలకుంట నుండి యాత్ర కొనసాగు తున్నడంతో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు స్వాగతం పలికి రాష్ట్రంలో నిర్వహించే యాత్రను విజయవంతం చేయాలని యువజన కాంగ్రెస్ నియో జకవర్గ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ మంజుల దస్తప్ప, సత్యపాల్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దౌల్తాబాద్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వ హించి వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్నారని అన్నారు. 3800 కిలోమీటర్ల పైన రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారన్నారు. ప్రజల కష్టాలు, బాధలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేని పరిస్థి తుల్లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్ రెడ్డి, గోపాల్, ఎం. అంజి, కృష్ణ, ఆశప్ప, షఫీ, శామప్ప, నరసింహులు, రమేష్, భీమ ప్ప తదితరులు పాల్గొన్నారు.