Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 17 రద్దుకు రాష్ట్రవ్యాప్త ఉద్యమం
- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక
నవతెలంగాణ-దోమ
మండల ఆసరా పింఛన్లు పొందుతున్న వికలాంగులు వృద్ధులు వితంతువుల పింఛన్లు మంజూరు కోసం ప్రభు త్వం విధించిన ఆదాయపరమితి నిబంధనను ఎత్తివే యాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి జిల్లా అధ్యక్షుడు జే.దశరథ్ డిమాండ్ చేశారు. మంగళ వారం మండల పరిధిలోనీ దాదాపూర్ పాఠశాల ఆవరణం లో ఎన్పిఆర్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ 40 శాతం వైకల్యం కలిగిన వారందరూ సంక్షేమ పథకాలకు అర్హులని 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం పేర్కొంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూగ వీకలాంగులకు 51శాతం వైకల్యం ఉంటేనే పెన్షన్లు మంజూరు చేయాలని జీవో తెచ్చారని అన్నారు. దేశంలో 62 శాతం మంది పిల్లలు వైకల్యంతో బాధపడుతున్నారని రాష్ట్రంలో 13 జిల్లాల్లో క్లోరోసిస్ బాధితులు ఉన్నారని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 90శాతం పాఠశాలలు విక లాంగులకు అందుబాటులో లేవన్నారు. మహిళ వికలాం గులపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రైతుబంధు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు మా త్రం ఆదాయ పరిమితులు పెట్టి పెన్షన్ ఇవ్వకుండా అన్యా యం చేయడం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్లో డిసెంబర్ 26 నుంచి 28 వరకు జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కే.గోపాల్, మండల కార్యనిర్వాహక నాయ కులు టి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.