Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని డివి జన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి జీహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. మంగళవారం డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఆయన జీహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ డివిజన్లో ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతాలోపం పనులు జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ఆయన తెలిపా రు. డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రయినేజీ సమస్య ప్రధా నంగా ఉందని త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తా నని పేర్కొన్నారు. అధికారులు నిత్యం బస్తీల్లో పర్యటించి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయ న అన్నారు. డివిజన్లో ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే తక్షణం ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. కార్యక్ర మంలో శ్రీకాంత్ రెడ్డి, నెలుట్ల జగన్, శ్రీకాంత్, శేకర్, ప్రభు దాస్, శ్రీనివాస్ రెడ్డి, మజ్హర్ సత్యనారాయణ, రామ రావు, షకీల్, వర్క్ ఇన్స్పెక్టర్ రాహుల్, సూపర్ వైజర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.