Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తూరు మండల వ్యవసాయ అధికారి గోపాల్
నవతెలంగాణ- కొత్తూరు
రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీలను ప్రతి ఒక్క రూ సద్వినియోగం చేసుకోవాలని కొత్తూరు మండల వ్యవ సాయ అధికారి గోపాల్ అన్నారు. మంగళవారం ఆయన తిమ్మాపూర్ రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన రైతు లకు 100శాతం సబ్సిడీపై కుసుమ విత్తనాలను అందించా రు. ప్రతి రైతుకు రెండు కిలోలు చొప్పున కుసుమ విత్తనాల ను గూడూరు, మక్త గూడ, రెడ్డిపాలెం, కుమ్మరిగూడ గ్రామాలకు చెందిన రైతులకు అందించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఆహార భద్రత మిషన్ క్రింద కుసుమ విత్తనాలను 100శాతం సబ్సిడీపై అందజే స్తున్నట్లు పేర్కొన్నారు. మండలానికి ఎనిమిది క్వింటాళ్ల కుసుమ విత్తనాలు వచ్చాయన్నారు. కుసుమ పంటను సాగు చేసే రైతులు పాసుబుక్, ఆధార్ కార్డుతో వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. కార్య క్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అనిత, చేగూరు పిఎసిఎస్ వైస్ చైర్మన్ మున్నూరు పద్మారావు, గూడూరు ఉపసర్పంచ్ దయానంద్ గుప్తా, రైతులు తదితరులు పాల్గొన్నారు.