Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్
- రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలు
నవతెలంగాణ-ఆమనగల్
అర్హులైన నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి ఇండ్లు నిర్మించి ఇస్తామని జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధిశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ అన్నా రు. తన కుమారుని జ్ఞాపకార్థం స్థాపించిన జర్పుల రాధా కృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడు కలను సోమవారం కడ్తాల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ మాట్లాడుతూ తన ట్రస్ట్ ద్వారా గత సంవత్సరం దీపావళి పండుగ రోజున ప్రారంభించిన నిత్యాన్నదానం నిరాటంకంగా కొనసాగుతుందని చెప్పారు. అదేవిధంగా మండలంలో వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలకు తక్షణసాయంగా రూ.5 వేలు ఆర్థికసాయం అందజేస్తున్నట్టు ఆయన గుర్తుచేశారు. గతంలో కోవిడ్ సమయంలో నిరుపేద కుటుంబాలతో పాటు ఉపాధి లేక పస్తులుంటున్న ఆయా వాహనాలు నడిపే వేల మంది డ్రైవర్లకు బియ్యం నిత్యావసర వస్తువులను ట్రస్ట్ ద్వారా అందజేశారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి మండలం లోని ఆయా గ్రామాల్లో ఉన్న అన్నివిధాలా అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి అనుకూలంగా ఉండే విధంగా పక్కా గృహాలను నిర్మించి ఇస్తామని జడ్పీటీసీ హామీ ఇచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్ కడ్తాల్ మండలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, జిల్లా రైతు సమన్వయ కమిటీ డైరెక్టర్ బాచిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తమవంతు సహకారం అందజేస్తామని ముందుకు వచ్చినట్టు దశరథ్ నాయక్ తెలిపారు. ఈ మేరకు చిన్న వయసులోనే భర్తను కోల్పోయి కూలీ పనులు చేస్తూ, ఉండడానికి ఇల్లు లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మండలంలోని ముద్వి న్ గ్రామానికి చెందిన శేడల యాదమ్మకు ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు సోమవారం గంప వెంకటేష్ గుప్తా, బాచిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి దశరథ్ నాయక్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కంబాలపల్లి పరమేష్, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు జోగు వీరయ్య, ఎంపీటీసీలు లచ్ఛిరామ్ నాయ క్, బొప్పిడి గోపాల్, ప్రియా రమేష్, బండి మంజుల చంద్ర మౌళి, సర్పంచ్‌లు యాదయ్య, గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, తులసి రామ్‌నాయక్, రవీందర్ రెడ్డి, సులోచన సా యిలు, భాగ్యమ్మ జంగయ్య, భారతమ్మ నర్సింహ గౌడ్, లోకేష్, కృష్ణయ్య, కమ్లి బిచ్యనాయక్, ఉపసర్పంచ్లు వినోద్, శారదా పాండు నాయక్, వెంకటేష్, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యా నాయక్, వెంకట్ రెడ్డి, వెంకటయ్య, ఏఎంసీ డైరెక్టర్లు లాయఖ్ అలి, నర్సింహ గౌడ్, నాయకులు నరసింహ, బాలకృష్ణ, జంగయ్య, శంకర్ నాయక్, బీక్యా నాయక్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.