Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల డిమాండ్
- తహసీల్దార్ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-దోమ
ఇండ్లు లేని నిరుపేదలు ప్రభుత్వం నిర్మించిన, నిర్మి స్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన పేదలకు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోవడానికి తహాసీల్దార్ కార్యా లయానికి వెళ్ళిన పేదలను అవమానపరిచే విధంగా మా ట్లాడిన ప్రజల ఇచ్చిన దరఖాస్తులను తీసుకోకుండా వారిని బెదిరించిన కుల్కచర్ల తహసీల్దార్ రమేష్‌ను వెంటనే స స్పెండ్ చేయాలని సోమవారం దోమ మండల కేంద్రంలో తహసీల్దార్ రమేష్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సంద ర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య మాట్లాడుతూ మూడు రోజుల కింద వ్యవ సాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కుల్కచర్ల తహాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి పేద లతో డబుల్ బడ్రూం దరఖాస్తులను తహసీల్దార్ ఇచ్చారు. పేదలు తీసుకొచ్చిన దరఖాస్తులను సవ్యంగానే తీసుకున్న తహసీల్దార్ రమేష్, మరుసటి రోజు మరికొందరూ డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తు నింపుకుని తహసీల్దార్ వెళ్తే తాను దరఖాస్తులు తీసుకోనని ఇవి ఫేక్ దరఖాస్తులు అని ఇబ్బం దికరంగా మాట్లాడి, ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసి ప్రజలు దరఖాస్తులు ఇవ్వకుండా వారని భయబ్రాంతులకు గురిచేస్తున్న తహసీల్దార్పైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై దరఖాస్తులు తహసీల్దార్‌కు ఇతర అధి కారులకు ఇస్తుంటారు. దరఖాస్తులు తీసుకుని వారి పరిధి లోని సమస్యను పరిష్కరించాలి లేకుంటే పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. కుల్కచర్ల తహసల్దార్ మాత్రం ప్రజావ్యతిరేకి, పేదల వ్యతిరేకి కాబట్టి ఆయ న వెంటనే కుల్కచర్ల మండలం తహసీల్దార్ నుంచి తొల గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. తహ సీల్దార్ పైన వెంటనే కలెక్టర్, సిసిఎల్ఏ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తామన్నారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా వ్యవసా య కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలిసొచ్చే సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభు త్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్య.కా. సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు హెచ్.సత్యయ్య, రఘు రా మ్, సీహెచ్. సత్యయ్య, శేఖర్, చెన్నారెడ్డి, మొగులయ్య, లక్ష్మణ్, పి.వెంకటేష్, రాములు, శ్రీను పాల్గొన్నారు.