Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల మతాల మధ్య చిచ్చుపెట్టె పనిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి
నవతెలంగాణ-షాద్‌నగర్
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల మధ్య కుల, మతాల తారతమ్యాలతో వేరు చేస్తుం దని, దేశంలో అన్ని కులాల, మతాలను ఏకం చేయాలనే సంకల్పంతోనే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేప ట్టారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహ రెడ్డి అన్నా రు. మంగళవారం షాద్‌నగర్ పట్టణ శివారులోని బైపాస్ వై జంక్షన్ వద్ద నియోజకవర్గ ఇన్చార్జి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయ న పాల్గొని మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పాదయాత్ర దేశంలో, రాష్ట్రంలో పెను రాజకీయ మార్పులు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో స్వాగత సత్కార ఏర్పాట్లు జరుగుతు న్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్ యూఐ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, కిసాన్ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ తదితర విభా గాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపా రు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి ప్రజలు రాహుల్ గాంధీ పాదయాత్రకు తరలి వస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆ కుట్రను ఆపేందుకే రాహుల్ గాంధీ దేశాన్ని సమైక్యంగా ఉంచడం కోసం పాదయాత్ర చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడికెళ్లినా ఐక్యత గురించి మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో లిక్కర్ స్కాంకు సంబంధమున్న కేసీఆర్ కూతు రు ఎమ్మెల్సీ కవితను ఈడి ఎందుకు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం లేదని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంతటివారిని ఈడి ప్రశ్నిస్తుందని మరి కవితను ఎందుకు ప్రశ్నించడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనని మునుగోడులో ఇద్దరు కలిసి కాంగ్రెస్‌ను ఓడిం చడానికి కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. అంతిమ గెలుపు కాంగ్రెస్‌దేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ కార్యక్ర మానికి పిలుపునిచ్చిన అందులో మొదటి స్థానంలో రం గారెడ్డి జిల్లా ఉంటుందని, జిల్లాలో మొదటి స్థానంలో వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో పిసీసీ మెంబర్ బాబ ర్ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాలరాజ్‌గౌడ్, కేశంపేట్ మండలం పిసిసి ప్రెసిడెంట్ జగదీశప్ప, సీనియర్ నాయ కుడు ఐఎన్టీయూసీ నేత రఘు, కేశంపేట్ మండలాధ్య క్షుడు వీరేశప్ప, కొత్తూరు మండల ప్రెసిడెంట్ హరినాథ్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ జితేందర్ రెడ్డి, బాదేపల్లి సిద్ధార్థ, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందే మోహన్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖదీర్, నల్లమోని శ్రీధర్, నెహ్రు నాయక్, ఎల్లంపల్లి సర్పంచ్ కిష్ట య్య, ఎంపీటీసీ అంజిరెడ్డి, సుదర్శన్, తుమ్మల గోపాల్, చించోడు బాబా, నవాజ్ గోరి, గంగమోని సత్తయ్య, అందే శ్రీకాంత్, మహబూబ్, అప్పారెడ్డి గూడ డిప్యూటీ సర్పంచ్ సీతారాం, లింగారెడ్డి గూడా అశోక్, సోలిపూర్ అనిల్, ప్రదీ ప్, జగన్, మంకాల శ్రీశైలం, బుగ్గ శ్రావణ్, దయాకర్, శ్రీకాంత్ రెడ్డి, కొత్తపేట్ శ్రీధర్, శేఖర్, మంగ మధు, శ్రీధర్, హలీం సాకేత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.