Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30న జిల్లాలోకి ప్రవేశం
- షాద్‌నగర్‌లో రాత్రి బస, 31న కొత్తూరులో లంచ్‌కు ఏర్పాట్లు
- పరిశీలించిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి
నవతెలంగాణ- కొత్తూరు
దేశ భావి ప్రధాని రాహుల్ గాంధీ కాశ్మీర్ టు కన్యా కుమారి వరకు చేపట్టిన జోడోయాత్ర ఈ నెల 30వ తేదీన రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనున్నట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి తెలిపారు. ఇప్పటికే యా త్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆ యన పేర్కొన్నారు. 30వ తేదీన సోలిపూర్ వై జంక్షన్ వద్ద ఆయనకు స్వాగతం పలకనునట్లు తెలిపారు. స్వాగత కార్య క్రమానికి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులంతా తరలిరా వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగ ళవారం ఆయన కొత్తూరు లోని పాపిరస్ పోర్ట్ రిసార్ట్ గ్రౌండ్లో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయడానికిగల స్థలా న్ని పరిశీలించారు.
జోడోయాత్ర రూట్ మ్యాప్
రాహుల్ గాంధీ చేపట్టిన జోడోయాత్ర ఈనెల 30వ తేదీన సాయంత్రం 7 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్న గర్ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. సోలిపూర్ వై జంక్షన్ వద్ద సాయంత్రం 7 గంటలకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలుకుతారు. ఆ రోజు రాత్రి షాద్‌నగర్ ఆర్టీవో కార్యాలయం సమీపంలో రాత్రి బస చేస్తారు. తిరిగి 31వ తేదీ ఉదయం 6 గంటల 30 నిమి షాలకు యాత్ర ప్రారంభమై పాత జాతీయ రహదారి షాద్‌నగర్, ఫరూఖ్‌నగర్, లింగారెడ్డి గూడా, చంద్రయన్ గుడా, నందిగామ, అయ్యప్ప టెంపుల్ మీదుగా 10 గంట ల 30 నిమిషాలకు కొత్తూరు చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం మధ్యాహ్న భోజనం చేసుకుంటారు. అనంతరం తిరిగి సాయంత్రం 4 గంటలకు యాత్ర ప్రా రంభమై రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని తొండుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాత్రి బస చేయనున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ షాద్‌నగర్ నియో జకవర్గం ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్, మీర్పేట్ కార్పొరేటర్ చల్ల బాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, కొత్తూరు మండల అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జితేందర్ రెడ్డి, మాజీ పార్లమెంట్ యూత్ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, ఎంపిటిసి కొమ్ము కృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ దయాకర్ రెడ్డి, కొత్తూరు యూత్ కాం గ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, శ్రీశైలం, శ్రవణ్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, శివ, రవికుమార్, బాలు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.