Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం
నవతెలంగాణ-కొత్తూరు
మనువాదం వల్లే దేశంలో మను షుల మధ్య అసమానతలు ఏర్పడ్డాయని అంబేద్కర్ ప్రజా సంఘ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం అన్నారు. మండలంలోని గూడూరు గ్రామంలో మంగళవారం సంఘ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కులాల ఆధారంగా దేశంలో మనిషికి విలువనిచ్చే దురాచారముందని, ఇది మానవ మనుగడకు ప్రమాద కరమని అన్నారు. అత్యధిక సాంకేతిక యుగంలోనూ నేటికి సమానత్వాన్ని కోరుకునే పరిస్థితిలో దేశంలో లేకపోవడం విచారకరమన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగా లలో కులం పేరుతో అణచివేత, దోపిడి ఇంకా కొనసాగు తుందని అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి ఆటంకంగా మారిన కుల వ్యవస్థను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడీలా పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ ప్రజా సంఘం గూడూరు గ్రామ కమిటీని ఎన్ను కున్నారు. అధ్యక్షులుగా మైలారం కుమార్, ఉపాధ్యక్షులుగా వికాస్, ప్రధాన కార్యదర్శిగా అఖిల్, సహాయ కార్యదర్శిగా సుదర్శన్, క్రీడా కార్యదర్శిగా మోడీ కరుణాకర్‌తో పాటు సలాదారులు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ ప్రజా సంఘ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైలారం సుబ్రహ్మణ్యం, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్, మహిళా నాయకులు జ్యోతి, నందిగామ మండల నాయకులు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.