Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్పల్లి
గ్రహణం సమయంలో బయటకు రాకూడదని వస్తే దుష్ప్రభావం జరుగుతుందని, కొన్ని రాశుల వారికి అపశకునం జరుగుతుందని ఇద్దరు ముగ్గురు చేరిన చోట గ్రహ ణం గురించి చర్చించుకు న్నారు. సోమవారం సాయంత్రం సూర్య గ్రహణం ఏర్పడడంతో ఎక్కడ చూసినా గ్రహణం గురించే చర్చిం చుకున్నారు. ముఖ్యంగా మహిళలు గ్రహణ సమయంలో గర్భిణులు బయటకు రాకూడదు ఏమీ తినకూ డదు అనే నమ్మకంతో కొందరు గర్భిణులను ఇండ్లకే పరిమితం చేశారు. మరికొంతమంది గ్రహణం ప్రారంభమైనప్పటి నుండి కనీసం తాగునీరు కూడా ముట్టుకోలేదు. మరికొందరు ఎప్పటిలాగే బయట తిరుగుతూ హౌటళ్ళలో నీరు, టీ తాగారు, సోషల్ మీడియాలో ఖగోళ శాస్త్రవేత్తలు సూర్య గ్రహణం గురించి దుష్ప్రభావాలు ఏమీ జరగవు అని వివరిస్తే, మత గురువులు గ్రహణం సమయంలో పాటించాల్సిన పద్ధతుల గురించి వివరించారు. ఏది ఏమైనా గ్రహణం సమయంలో వారి వారి పద్ధతులను పాటించారు. నేటి కంప్యూటర్ యుగం లో మానవుడు చంద్రమండలానికి వెళ్లి వస్తున్నా కూడా ఇంకా మూఢనమ్మకాలు ఏంటి అని కొందరు అంటున్నారు.