Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ గిరి
నవతెలంగాణ- కుల్కచర్ల /చౌడపూర్
మద్యం తాగి వాహనాలు నడిపితే, కఠిన చర్యలు తప్పవని కుల్కచర్ల ఎస్ఐ గిరి అన్నారు. మంగళవారం చౌడపూర్ మండల కేంద్రంలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మద్యం సేవించి వాహనాలు నడిపి ఇతరుల మరణాలకు కారణం కావొద్దని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు, పెండింగ్ చలా న్లు, హెల్మెట్ ధారణ, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. పోలీసులు చేసే వాహన తనిఖీలు కేవలం ప్రజల ప్రాణరక్షణ కోసమేనని తెలిపారు. రోడ్డు ప్రమా దాలు ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.