Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
తెలుగు శాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్య తుమ్మల రామకృష్ణ ఆచార్య జి.అరుణ, కుమారిలకు ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన సన్మాన సభ నిర్వహించారు. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య వి.కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని, ఇరువురిని ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా సాహిత్యాలను బోధించే అధ్యాపకులకు, కవి, రచయి తలకు సాంకేతికంగా పదవీవిరమణ జరిగినప్పటికీ వారి రచనా రంగంలో పదవీవిరమణ ఉండదని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ కాలం పాటు తెలుగు శాఖలో పనిచేసిన, వందలాది మంది విద్యార్థులకు పరిశోధక బాధ్యతలు వహించా రని వక్తలు ప్రశంసించారు. ఆచార్య తుమ్మల రామకృష్ణ తెలుగు శాఖలో ఉద్యోగ విరమణ చేస్తున్నప్పటికీ ద్రావిడ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్‌గా ఇంకా రెండున్నరేళ్లపాటు పనిచేస్తారన్నారు. ఆచార్య జి. అరుణకుమారి ఈ నెల ఆఖరికి ఉద్యోగ విరమణ చేసినా రచనా వ్యాసంగం కొనసాగిస్తారని పేర్కొ న్నారు. ఈ సమావేశంలో ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, డా.బాణాల భుజంగరెడ్డి, ఆచార్య దాసర విజయకుమారి తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆచార్య జి.అరుణకుమారి ఉద్యోగ విరమణను పురస్కరిం చుకుని పూర్వ విద్యార్థులు, పరిశోధకులు ఒక జాతీయ సదస్సుని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు. పూర్వ విద్యార్ధులు ఆచార్య జి.అరుణకుమారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య పరిమి రామ నరసింహం, ఆచార్య ఎన్.ఎస్.రాజు అతిథులుగా పాల్గొన్నారు.