Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొయినాబాద్
మొయినాబాద్ మండలంలోని జేబీఐటీ కళాశాలలో ఫస్టియర్ బీటెక్ విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేబీ విద్యాసంస్థల కార్యదర్శి శ్రీ జేవీ కృష్ణారావు, ముఖ్యఅతిథిగా నవీన్ మిట్టల్ ఐఏఎస్, కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్, గౌరవ అతిథిగా బ్రహ్మచారి సత్య చైతన్య, రామకృష్ణ మఠ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జేబీ విద్యాసంస్థల సీఈవో డాక్టర్ మేజర్ జనరల్ ఎస్ఎస్ దశక, జేబీఐటి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీసీ కృష్ణమాచారి, భాస్కర ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.అనంతరం జేబీ విద్యాసంస్థల కార్యదర్శి జేవీ కృష్ణారావు మాట్లాడుతూ ఈ ఏడాది జేబీఐటి కళాశాల 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ అడ్మిషన్లు జరుగుతున్నట్టు తెలిపారు.ఈ కళాశాలలో చేరిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కళాశాలలో చేరిన విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని, సమాజం ఆశించిన విధంగా ఎదగాలని కోరారు.లైఫ్ స్కిల్స్ తమ కళాశాల ప్రత్యేకమైన విభాగం అన్ని తెలిపారు. విద్యాసంస్థల సీఈవో ఎస్ఎస్ దసక మాట్లాడుతూ వీకెన్ యువర్ వీక్నెస్ అండ్ స్త్రెంగ్థ్ఎన్ ఇన్ యువర్ స్ట్రెంత్ అని తెలిపారు.ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమాచారి మాట్లాడుతూ తమ కళాశాలలో మెరుగైన విద్య అందిస్తున్నట్టు తెలిపారు. గౌరవ అతిథిగా విచ్చేసిన బ్రహ్మచారి,సత్య చైతన్య మాట్లాడుతూ వివేకానందుని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలో నడవాలని సూచించారు. నవీన్ మిట్టల్ మాట్లాడుతూ క్రమశిక్షణతో చదివి ఈ నాలుగేండ్లలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాలని కోరారు. డాక్టర్ సుమాగ పట్నాయక్ సీనియర్ విద్యార్థులచే యాంటీ ర్యాగింగ ప్లేడ్జ్ చేయించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనివాసులు పరీక్షల నియమ నిబంధనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేఐటీఆర్ అండ్ డీన్ డాక్టర్ నీరజ్ ఉపాధ్యయ, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాస్కర ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరావు, జేబీఆర్ఈసి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారెడ్డి,కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో హాజరయ్యారు.