Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీప్యూటీ డీఎంహెచ్వో డివిజన్ వైద్యులు దామోదర్
నవతెలంగాణ-శంకర్పల్లి
గర్భిణుల వైద్యం సంబంధించిన వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని డిప్యూటీ డిఎంహెచ్వో చేవెళ్ల డివిజన్ వైద్యులు దామోదర్ అన్నారు. శుక్రవారం శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శంకర్పల్లి, టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సూచికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యురాలు రేవతిరెడ్డి, టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు జ్యోతి, సిహెచ్ఓ శ్రీ గోపాల్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాస్, సూపర్వైజర్లు, రెండు ప్రాథమిక కేంద్రాల ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణుల నమోదు క్రమం తప్పకుండా రిజిస్ట్రర్లో నమోదు చేయాలనీ, అన్ని ప్రసవాలను ప్రభుత్వాస్పత్రిలోనే చేయించాలన్నారు. తప్పనిసరి పరిస్థితి తప్ప కేసును రిఫర్ చేయకూడదన్నారు.అలాగే ఏ చిన్నారులకు టీకాలు మిస్ కాకూడదని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఎవరైనా మిస్ అవుట్స్ గాని డ్రాపోర్ట్స్ కానీ ఉంటే ఆ చిన్నారులకు సర్వే చేయించి టీకాలు వేసే విధంగా కృషి చేయాలని చెప్పారు. నవంబర్ 7 నుంచి 18వ తేదీ వరకూ టీ టానస్, డిఫ్తీరియా నిరోధక టీకాలను10 ఏండ్లకు, 16 సంవత్సరాల పిల్లలందరికీ ఈ టీకాలు ఇప్పించాలన్నారు. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ను సబ్ సెంటర్ వారిగా పి హెచ్సీలు తయారు చేసి జిల్లాకు పంపించాలని ఆదేశించారు. అంతేకాకుండా సిబ్బందికి వివరించి యాక్షన్ ప్లాన్ సబ్మీట్ చేయాలని వివరించారు. మండల స్థాయిలో డిఫ్తీరియా, టిటానస్ సంబంధించిన పక్షోత్సవ క్యాంపెయిన్ ప్రారంభించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఆశల నుంచి మెడికల్ ఆఫీసర్ల వరకు అన్ని స్థాయిల సిబ్బంది సమయపాలన పాటించి, విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోగులందరికీ వైద్య సౌకర్యాలు అందే విధంగా చూడాలని ఆదేశించారు. టీబీ రోగులకు కూడా సకాలంలో మందులు అందే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు.