Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆశా భావం వ్యక్తం చేశారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య ఆధ్వర్యంలో యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డితో కలిసి చేవెళ్ల మండలంలోని రావులపల్లి(ఖుర్దూ) గ్రామ సర్పంచ్, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు కేసారం శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో నాంపల్లి మండలం పసునూరి గ్రామంలో ప్రచార కార్య క్రమంలో మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాల ఫలాలు వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని, కేసిఆర్ నాయకత్వాన్ని బలపర చాలని కోరారు. రాజగోపాల్ రెడ్డిపై నమ్మకంతోఈ ప్రాంత ప్రజలు గెలిపిస్తే మూడున్నరేండ్లలో కనీసం గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. రాజగోపాలరెడ్డి రూ. 18వేల కోట్ట కాంట్రాక్ట్‌కు అమ్ముడుపోయి పార్టీ మారిన కారణంగా ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలన్నా, ప్రజల సమస్యల పరిష్కరం కావాలన్నా సీఎం కేసీఆర్ నాయకత్వతోనే సాధ్యమవుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో రావులపల్లి గ్రామ మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి, చేవెళ్ల మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బూర్ల మహేష్, రావులపల్లి బీఆర్ఎస్ నాయకులు విట్టలయ్య, కుమార్ గౌడ్, నర్సింలు, గోపాల్, పెంటయ్య, శ్రీనివాస్, బాలరాజ్ , అనంతయ్య, నర్సింలు, రమేష్, మల్లేష్ పాల్గొన్నారు.