Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవలు
- రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి 2.5 లక్షల విరాళం
నవతెలంగాణ-ఆమనగల్
పేద ప్రజలకు విద్యా వైద్యం ఉపాధి అందించాలనే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ పనిచేస్తుందని ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని సంకటోని పల్లి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు శుక్రవారం ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సంకటోనిపల్లి గ్రామంలో పర్యటించారు. ఈసందర్భంగా గ్రామంలో అసంపూర్తిగా ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి తనవంతు విరాళంగా రూ.2.5 లక్షలు అందజేస్తానని అన్నారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణినికి తనవంతు సహకారం అందజేస్తానని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాలు మానసిక ప్రశాంతతను, సనాతన సాంప్రదాయాలను పెంపొందించుకోవడానికి దోహద పడతాయని అన్నారు. పల్లెలు అభివద్ధి చెందినప్పుడే ప్రగతి సాధ్యమౌతుందని ఆదిశగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడ్తున్నట్టు చెప్పారు. అనంతరం ఆయన తలకొండపల్లి మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామంలో పర్యటించి ఆలయాలతో పాటు గ్రంథాలయం అభివద్ధికి తనవంతు విరాళం అందజేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి, సభ్యులు సురేష్ రెడ్డి, సతీష్ రెడ్డి, గన్నోజు సత్యం, చంద్రశేఖర్, శ్రీరాములు, మల్లేష్, కొండల్, రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మానయ్యను పరామర్శించిన సుంకిరెడ్డి
ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వస్పుల మానయ్యను శుక్రవారం ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పరామర్శించి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకునేందుకు వైద్యులు ఇచ్చిన సలహాలను తప్పక పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి, మాజీ సర్పంచ్ రచ్చ శ్రీరాములు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మైసయ్య, సత్యం, చంద్రశేఖర్, మల్లేష్, శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.