Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ - కుల్కచర్ల
రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జిల్లా డీసీసీ అధ్య క్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు మద్దతుగా మహ బూబ్‌నగర్ జిల్లా మన్యంకొండలో నిర్వహించిన భారీ బహి రంగసభకు శుక్రవారం కుల్కచర్ల మండలం నుండి కాం గ్రెస్ నాయకులు అధికసంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ...అన్ని వర్గాల ప్రజల అభి వృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. దేశం మొత్తం రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర వైపు చూస్తుంద న్నారు. కాంగ్రెస్ పూర్వవైభవం సాధించడం ఖాయం అన్నా రు. కార్యక్రమంలో బ్లాక్ బి అధ్యక్షుడు కర్రే భరత్‌కుమార్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు ఆంజనేయులు ముదిరాజ్, మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, ఎంపీటీసీ ఆనందం ముదిరాజ్, భీం భాస్కర్, సోమలింగం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.