Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ వైస్ చైర్మెన్ భీమనపల్లి దుర్గయ్య
- శ్రీనివాస కాలనీలో అంతర్గత మురికి కాలువ పనులు ప్రారంభం
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మున్సిపల్ వైస్ చైర్మెన్ భీమనపల్లి దుర్గయ్య అన్నారు. శుక్రవారం మున్సిపల్ చైర్మెన్ నేనావత్ రాంపాల్ నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ తదితరులతో కలిసి వైస్ చైర్మెన్ భీమనపల్లి దుర్గయ్య ఆమనగల్ పట్టణంలోని 13వ వార్డులో ఉన్న శ్రీనివాస కాలనీలో అంతర్గత మురికి కాలువ నిర్మాణ పను లను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ పట్టణ ప్రగతి నిధుల నుంచి రూ.4 లక్షలు వెచ్చిం చి అంతర్గత మురికి కాలువను నిర్మిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా ఆమనగల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరిచి ఆదర్శ మున్సిపాలిటీగా మార్చడ మే లక్ష్యంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు దుర్గయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చెన్నకేశ వులు, సీనియర్ నాయకులు గోరటి నర్సింహ, బైకని శ్రీశై లం యాదవ్, శ్రీకాంత్ సింగ్, కోఆప్షన్ సభ్యుడు మేడిశెట్టి శ్రీధర్, నాయకులు కోట శ్రీను, గాజుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.