Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.మధుసూదన్ రెడ్డి
- తలకొండపల్లి మండల రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-ఆమనగల్
రైతుల రుణ విముక్తి కోసం పార్లమెంటులో ఆమో దించి చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘం జిల్లా కార్య దర్శి బి.మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తలకొండపల్లి మండల కేంద్రంలో ప్రజాసంఘాల జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య అధ్యక్షతన జరిగిన సమా వేశంలో రైతు సంఘం మండల నూతన కమిటీని ఏకగ్రీ వంగా ఎన్నిక చేశారు. రైతు సంఘం మండల అధ్యక్షుడిగా పిప్పళ్ళ రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా శివగల్ల రమేష్, ఉపాధ్యక్షులుగా వెంకట్ రెడ్డి, కృష్ణయ్య, సహాయకార్యద ర్శులుగా సీహెచ్ మల్లేష్, జంగయ్య, పర్వతాలు, ఈ స మావేశానికి ముఖ్యఅతిథులుగా జిల్లా కార్యదర్శి మధుసూ దన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ధాన్యం సేకరణను ప్రయి వేటీకరణను అరికట్టి విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉప సంహరించుకోవాలని సూచించారు. స్వామినాథన్ కమి షన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేసి కనీస మద్దతు ధరల చట్టం తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవి ధంగా ధరణిలో ఉన్న లోపాలను సవరించాలని, కౌలు రైతులను ప్రభుత్వాలు గుర్తించి రుణ ఆర్హత కార్డులు అం దజేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు నరసింహ, ప్రజా సంఘాల నాయకులు దుబ్బ చెన్నయ్య, పెంటయ్య, సత్తయ్య, శీను తదితరులు పాల్గొన్నారు.