Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నాయకులు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూర్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి ,కార్యదర్శి రమేష్ కుమార్, మాజీ గ్రంథాలయ చైర్మెన్ మురళీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొనుగోలపై చేసిన డ్రామాలో ప్రధాన పాత్ర పైలెట్ రోహిత్ రెడ్డిదేనని అన్నారు. ఏ చట్ట విరుద్ధ పనిలో తాండూర్ ఎమ్మెల్యేకు సంబంధం ఉందన్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు, డిగ్రీ సర్టిఫికెట్తో ఓటు వేసి అలాగే బెంగళూరు డ్రగ్స్ కేస్ అలాగే గుట్కా మాఫియా, ఇలా ఆయన పై ఉన్న నేర ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తాండూర్ ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వగలరా అని సూటిగా ప్రశ్నించారు. అమ్ముడు పోవడంలో తాండూరు ఎమ్మెల్యేది ప్రథమ స్థానంలో ఉంటున్నాడని ఎద్దేవా చేశారు.
ఇకనైనా ఎమ్మెల్యే తన నీతి నిజాయితీని నిరూపించుకోవాలని అలా నిరూపించుకున్న తర్వాతనే తాండూర్లో అడుగు పెట్టాలన్నారు. లేదంటే ఆయనని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పూజారి పాండు, భద్రేశ్వర్, రజిని, కిరణ్, కౌన్సిలర్లు అంతారం లలిత, బాలప్ప పట్టణాధ్యక్షులు సుదర్శన్, సందీప్ మహిళా మోర్చా నాయకులు కార్యకర్తలు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.