Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ మండలాధ్యక్షులు ఎండీ అజ్మత్‌ఖాన్
నవతెలంగాణ-మంచాల
మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో బోధన సమయాన్ని మార్చాలని టీఎస్ యూటీఎఫ్ మండలాధ్యక్షులు ఎండి అజ్మత్‌ఖాన్ అన్నారు. శనివారం మండల పరిధిలోని నోముల గ్రామంలో ఉన్న బీసీ గురుకులాలు ఇబ్రహీంపట్నం, గోషామహల్, మలక్‌పేట్ మొదలగు పాఠశాలల ఉపాధ్యాయులు మధ్యాహ్న సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ గురుకుల పాఠశాలలో బోధన సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఉందన్నారు.దీంతో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొ ంటున్నారని తెలిపారు. బీసీ గురుకుల పాఠశాలల బోధన సమయం కూడా ఇతర సంక్షేమ గురుకుల పాఠశాలల మాదిరిగానే బోధన సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 :30 లకు మార్చాలని కోరారు. అతిథి ఉపాధ్యాయులకు దసరా సెలవుల వేతనం చెల్లించి, గురుకుల ఉపాధ్యాయుల పని భారం తగ్గించాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బాలునాయక్, జిల్లా కౌన్సిలర్ లాలగారి నాగేష్, పాఠశాలల ఉపాధ్యాయులు భరత్ కుమార్, జయ, యాస్మిన్, అనిత, సాగర్, శివ తిరుమల్, శేఖర్, రాంలాల్, దేవి, మాధవరావు, విష్ణు, లక్ష్మి, అనురాధ మహేష్ వేణుగోపాల్ ఉన్నారు.