Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
జీవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి పార్ట్-2 ప్రగతినగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, పోచమ్మ ఆలయం సమీపంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు ఫౌండర్, గజ్జెలు యోగానంద్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో బీపీ పరీక్ష, షుగర్ పరీక్ష, ఎస్.పి.ఓ 2 పల్స్, జనరల్ ఫిిజీషియాన్ కంటి పరీక్ష, సంబంధిత సమస్యలకు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ నిపుణులైన అనుభవం ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో రక్తంలో షుగరు, బీపీ గుండెకు సంబంధించిన ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహించి, గుండె వ్యాధులను నిర్ధారించడం జరుగుతుందన్నారు.ఈ పరీక్షలను ఉచితముగా నిర్వహంచి అవసరమైన వారికి ఉచితముగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరంలో పేదలకు ఏదైనా వైద్యం కానీ తక్షణ వైద్య సహాయం అవసరమైన వారికి అందిస్తామని అయన తెలిపారు.