Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్ రెడ్డిని గెలిపించండి
- యూటీఎఫ్ జిల్లా కోశాధికారి జగన్నాథ్
- బీసీ మహత్మ గాంధీ,జ్యోతిరావు పూలే గురుకులాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన
నవతెలంగాణ-యాచారం
గురుకుల ఉపాధ్యాయులపై పనిభారాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ జిల్లా కోశాధికారి జగన్నాథ్ డిమాండ్ చేశారు. శనివారం యాచారం మండల పరిధిలో ఉన్న బీసీ మహాత్మగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో బోధన సమయాన్ని మార్చాలని యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ గురుకులాల్లో సమయాన్ని 9 గంటల నుండి 4:30లకు మార్చాలన్నారు. వెంటనే గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. వెంటనే డీఎస్సీని నిర్వహించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులంతా ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కారం కావాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్షులు నరసింహా, కార్యదర్శి పి అంజయ్య, బీసీ గురుకుల ప్రిన్సిపాల్ సోనీ కుమారి, సాయిని, శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.