Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత పిచ్చితో దేశాన్ని సర్వనాశనం చేస్తున్న స్వామీజీలు
- తెలంగాణలో బీజేపీ ఆటలు సాగన్వివం
- టీఆర్ఎస్ మండలాధ్యక్ష,కార్యదర్శులు రమేష్, బహదూర్
నవతెలంగాణ-మంచాల
బీజేపీ నాయకులు మతపిచ్చి స్వామీజీలతో మమేకమై, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోల ప్రయత్నంపై తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ మండలాధ్యక్ష,కార్యదర్శులు రమేశ్, బహదూర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై ఈడి,సీబీఐ దాడులు చేయిస్తూ, అధికార దుర్వినియోగం చేస్తుందన్నారు. ముఖ్యంగా బీజేపీి ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రమత్తం కావాలన్నారు. ఆడియో టేపులు బయట పడటంతో దిక్కు తోచని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంటే,రాష్ట్రంలోని బీజేపీ నాయకులు మాత్రం 'కల్లు తాగిన కోతులా' గంతులు వేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు గర్వపడుతుంటే, రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు ఎందుకు అర్థకావడం లేదన్నారు. గ్రామాల్లో హిందూ, ముస్లిం ,క్రైస్తవుల మధ్య మత చిచ్చు పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు. మత పిచ్చి బీజేపీని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనీ, అదేవిధంగా మునుగోడు ఉపఎన్నికల్లో ఓటరులు బీజేపీని ఓడించి,టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల యువజన విభాగం మండలాధ్యక్ష,కార్యదర్శులు వన పర్తి బద్రీనాథ్ గుప్త,గంట విజరు,నాయకులు మొగిలి వెంకటేష్, పల్లాటి బాల్ రాజ్,ఎం డి జానీ పాషా, కసరమొని మహేందర్ యాదవ్,అమరెందర్ రెడ్డి,శ్రీరాములు, ఆవుల ప్రశాంత్ యాదవ్, ప్రవీణ్, లల్లు యాదవ్,నర్సింహ తదితరులు ఉన్నారు..