Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాబాద్ ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్ రెడ్డి
నవతెలంగాణ-షాబాద్
గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేందర్‌రెడ్డి అన్నారు. తిర్మలాపూర్‌లో విద్యుత్ సమ స్యలు తలెత్తున్నా యని సర్పంచ్ శ్రీధర్‌రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చాడు. కుమ్మరిగూడలో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ కేతన సభ దృష్టికి తీసుకువచ్చారు. శనివారం షాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్రెడ్డి అధ్యక్షతన వైస్ ఎంపీపీ జడల లక్ష్మీరాజేందర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, ఎంపీడీవో అనురాధ, డిప్యూటీ తహసీల్దార్ క్రాంతికిరణ్‌లతో కలిసి సభను నిర్వహించారు. అనంతరం ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందు బాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు నిర్వహించే సమయంలో ఎంపీటీసీలు, సర్పం చులకు సమా చారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటే అధికారులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ఉండా లన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకటేశం, ఎంఈవో శంకర్‌రాథోడ్, ఎంపివో హన్మంత్‌రెడ్డి, వైద్యులు వరలక్ష్మీ, స్రవంతి, ఏఈలు నరేందర్, శారధ, ఎపీవో వీరాసింగ్, ఎంపీవో నర్సింహులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.