Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని హనీఫ్కాలనీ, పాన్ మక్త కాలనీల్లో రూ.73లక్షల అంచనావ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. అదేవిధంగా కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ,సీసీరోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషకరమని తెలిపారు.ఈ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.ఈ నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని తెలిపారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని హనీఫ్ కాలనీ లో రూ. 50 లక్షల అంచనావ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్టు చెప్పారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని పాన్ మక్తలో రూ.23 లక్షల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు జంగం గౌడ్,శ్రీనివాస్ చౌదరీ,తిరుపతి, రజినీకాంత్, తిరుపతి యాదవ్, దశరథ్, సమ్మద్, హనీఫ్, జాఫర్, తోట సురేష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, టీఆర్ఎస్ అను బంధ సంఘాల ప్రతినిధులు ,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.