Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి జ్ఞానేశ్వర్ ముదిరాజ్
- 31న శంషాబాద్‌కు రానున్న రాహుల్ గాంధీ
నవతెలంగాణ-శంషాబాద్
భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర కార్యక్రమానికి ప్రజలు పార్టీలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి బి.జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర శంషాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటున్న నేపథ్యంలో శనివారం ఆయన శంషాబాద్ మండలం కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31వ తేదీన నాలుగు గంటలకు శంషాబాద్ మండల పరిధిలోకి తిమ్మాపూర్ గేటు వద్ద రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలుకుతామని తెలిపారు. మంచి పాదయాత్రగా తోండుపల్లి గ్రామానికి వస్తారని తెలిపారు. అక్కడ జడ్పిహెచ్ఎస్ పాఠశాల వెనుకాల బస చేసి, నవంబర్ ఒకటో తేదీన ఉదయం పాదయాత్రగా హైదరాబాద్ వెళ్తారని తెలిపారు. రాహూల్ గాంధీ రాక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో క్లిష్ట పరి స్థితులు నేపథ్యంలో దేశాన్ని కాపాడి, ఐక్యతను సాధించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ పాద యాత్ర చేపట్టారని తెలిపారు. ప్రజలందరూ పార్టీలకతీతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్య క్రమంలో టీపీసీసీ ఎస్సీ సేల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్పల్లి నరేందర్, శంషాబాద్ మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్, పిఎస్ సంజరు యాదవ్, నియోజకవర్గ నేతలు డప్పు నవీన్, ఖాలేద్, బాలరాజ్ , ధనుంజరు, కాజోద్దీన్, షాబుద్దీన్, జహంగీర్ పాష, గణేష్, శ్రీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.