Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4 ప్లస్ 4 గన్మెన్ల పెంపునకు ఉత్తర్వులు జారీ
- బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకతా చాటుకుంటున్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకతను చాటుకుంటూ, తనదైన శైలిలో ముద్ర వేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బీజేపీ ఆగడాలను తెలిసే విధంగా వివరించిన తీరు, ప్రజల్లో హర్ష అతిరేకలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ప్రత్యేక భద్రత పెంపునకు ఉత్తర్వులు జారీ చేసింది. 4 4 గన్మెన్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా గురి చేసిన వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలన సృష్టించాయి. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన సమాచారంతోనే మొయినాబాద్ ఫామ్ హౌస్లో దాడులు చేసినట్టు పోలీస్ అధికారులు చెబుకుంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తులను రెడ్హండ్గా పట్టించేందుకు ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు పట్ల టీఆర్ఎస్ నాయకులు, పార్టీ అధిష్టానం హర్షం వ్యక్తం చేసింది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీస్ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముందుండి రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. గతంలో 2 ప్లస్ 2 గన్మెళ్లను కలిగి ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డి ఈ వ్యవహారంతో ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేయడంతో తాండూరు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.