Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డప్పు దరువుల, కళాకారుల నృత్యాలతో రాహుల్ గాంధీకి స్వాగతం
- 30 వేల మందితో ఘనంగా ఎదురుకోలు
- షాద్నగర్ వై జంక్షన్ వద్ద సభలో ప్రసంగించనున్న రాహుల్
- ఏర్పాట్లు సిద్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్ ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ 'దేశాన్ని రక్షిందాం.. ప్రజాస్వామ్యానికి కాపాడుకుందాం' అని దేశ వ్యాప్తంగా చేపట్టనున్న భారత్ జోడోయాత్ర కన్యకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగనుంది. తెలంగాణలో మహుబుబ్నగర్ జిల్లాలో పూర్తి చేసుకున్న రాహుల్ జోడో యాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టనుంది. రంగారెడ్డి జిల్లాలోని బూర్గుల గ్రామంలో ప్రారంభంకానుంది. షాద్నగర్ ప్రాంత మీదుగా జిల్లాలో రెండు రోజులు పాటు సాగనుంది. మొదటి రోజు షాద్నగర్ వై జంక్షన్లో కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. పాదయాత్ర ముగింపు అనంతరం వై జంక్షన్ వద్ద పాదయాత్ర బృందం బస చేయనున్నది. తిరిగి సోమవారం ఉదయం 6 గంటలకు వై జంక్షన్ నుంచి షాద్నగర్ పట్టణ కేంద్రం మీదుగా లింగారెడ్డిగూడా, చంద్రాయనగూడెం, నందిగామ, కొత్తూరు, తిమ్మాపూర్ నుంచి పాలమాకుల వరకు పాదయాత్ర సాగనుంది. ప్రతి మండల పరిధిలో జరిగే జోడో యాత్రలో ఆ పార్టీ నేతలు నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీతో అడుగులు వేయనున్నారు. విడతల వారీగా ఆయా గ్రామాల పరిధిలోని నేతలు పాదయాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ యాత్రలో సుమారు 30 వేల మంది కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. జిల్లాలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభంతో జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహం ఉరకలేస్తోంది.