Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చేవెళ్ల పేరును ప్రస్తావిస్తే సహించబోమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ మతతత్వ పార్టీ అని, ఆ పార్టీలో దళితులకు స్థానం ఎక్కడ ఉంటుందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక దళితులకు, పేద ప్రజలకు, మహిళలకు ఎం న్యాయం చేశారో తెలపాలని నిలదీశారు. డబ్బులు ఉన్నంత మాత్రాన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామనడం సరైనది కాదన్నారు. రెండో ఆడియో లీకేజీలో చేవెళ్ల, పరిగి, కొడంగల్ పేరు తెరపై తెచ్చినందుకు స్పందించామని, ముఖం, పరిచయం లేని వ్యక్తి తమ పేర్లు ప్రస్తావించడం సరికాదన్నారు. తప్పుడు సమాచారాలు ఇస్తే చెప్పుతో కొడుతానని హెచ్చరించారు. ఏడాది కాలం నుంచి తన ఫోన్ కాల్ డాటా తీసి పరిశీలించండి అంటూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో షాబాద్ జడ్పీటీసీ అవినాష్ రెడ్డి, మండలాధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, వైస్ ఎంపీపీ శివప్రసాద్, సీనియర్ నాయకులు రమణారెడ్డి, నవాబ్ పేట మాజీ జడ్పీటీసీ పోలీస్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మెన్ బ్యాగరి నర్సింహులు, సర్పంచ్ కేసారం శ్రీనివాస్, ఆలూరు ఎంపీటీసీ నరేందర్చారి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తెలుగు వెంకటేష్ ముదిరాజ్, ఫయాజ్, కర్ణాకర్ రెడ్డి, బూర్ల మహేష్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గౌండ్ల యాదగిరి, యూత్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్, సివిల్ సప్లై జిల్లా కమిటీ సభ్యులు రవీందర్, నాయకులు పామేన విజరు, హనుమంత్ రెడ్డి, బూర్ల సాయినాథ్, శ్రీధర్ రెడ్డి, ఊరడి రాజు, భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.