Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పట్టించుకోవడంలేదు:ప్రజా ప్రతినిధులు
- ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం:ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్
నవతెలంగాణ-శంషాబాద్
ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం శంషాబాద్ మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ కార్యా లయంలో ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ అధ్యక్షతన జరి గింది. ఈ సమావేశంలో పలు సమస్యలపై అధికారులను ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. ప్రధానంగా విద్యుత్తు, రేషన్ కార్డులు, తాగునీరు, ఆర్టీసీ రోడ్ల మరమ్మతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని హమీదుల్లానగర్ గ్రామం ఔటర్ రింగ్‌రోడ్ లోపల ఉన్నందున మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామ స్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని గ్రామ సర్పంచ్ వి.సతీష్ కుమార్ అన్నారు. ఈ విషయంపై అధికారులతో అనేకసార్లు చర్చించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముచింతల్ గ్రామంలో పైపులైన్ పగిలి 8 నెలలు కావస్తున్నా, కనీసం మర మ్మతులు చేపట్టకపోవడంతో నీరంతా వృథాగా పోతుందని గ్రామ సర్పంచ్ వి.సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. నర్కుడ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సరిపోవడంలేదని ఆ గ్రామ సర్పంచ్ లక్షా లీటర్లు నీరు పెంచాలని కోరారు. మదనపల్లి పాతతండా గ్రామంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ఆర్టీసీ బస్సులు గ్రామ చౌరస్తా వద్ద ఆపడం లేదని సర్పంచ్ రవీందర్‌నాయక్ అన్నారు. కొత్త పింఛన్ కార్డులు ఇవ్వడంలో వచ్చిన వాటిని కూడా అధి కారులు కట్ చేస్తున్నారని ఇలా చేయడం వల్ల చాలా ఇబ్బం దులు వస్తాయని ఎంపీటీసీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్ అన్నారు. ఆర్టీసీ బస్సులు మరుమూల గ్రామాలకు నడ పడం లేదని దీనివల్ల విద్యార్థులు మహిళలు తీవ్రంగా నష్ట పోతున్నారని పిల్లని కూడా అల్లికోల్ తండా , సుల్తాన్ పల్లి, ఘాన్సీమియాగూడా గ్రామప్రజాప్రతినిధులు అన్నారు.
పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ సమస్య పరిష్కరించాలి
పెద్ద గోల్కొండ జంక్షన్ నెలరోజులుగా నీళ్లలో ఉండటం వల్ల సుమారు 100 గ్రామాలు రాకపోకలు ఆగిపోయాయని దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ గ్రామ సర్పంచ్ కామోనిబాయి లక్ష్మయ్య, ఎంపీటీసీ గడ్డమీది యాదగిరి అన్నారు. సమస్యపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేబిదొడ్డి-రాయన్నగూడ రోడ్డు బాగు చేయాలి
అమ్డాపూర్-కేబి దొడ్డి గ్రామాల మధ్య ఉన్న రోడ్డు వివాదాల కారణంగా పూర్తిగా గుంతల మయంగా మారిందని సుల్తాన్‌పల్లి సర్పంచ్ దండు ఇస్తారి అన్నారు. సమస్యపై సంవత్సర కాలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
త్వరలో రోడ్డు ఆర్అండ్బీ రోడ్ల విస్తరణ
శంషాబాద్ మండలంలో ఆర్అండ్బీ రోడ్ల పనులు విస్తరణ చేపట్టబోతున్నామని ఆర్ అండ్‌బీ అధికారి చంద్రశేఖర్ అన్నారు. శంషాబాద్- బహదూర్ గూడ గ్రామాల మధ్య 84 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు, శంషాబాద్ బస్ స్టేషన్ నుంచి ఓయాసిస్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అమ్మపల్లి వరకూ రూ. 48 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు , రైల్వే కమాన్ నుంచి ధర్మగిరి వరకు నాలుగు లైన్ల రోడ్డు రూ.64 కోట్ల తో నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. నవంబర్‌లో టెండర్లు పూర్తిచేసి డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించనున్నట్టు ప్రకటించారు.
రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి
నర్కూడ- పెద్ద షాపూర్ , రాయన్న వయా పిల్లోని గూడ కూడా మీదుగా రోడ్డు విస్తరణ కోసం ప్రారంభం చేసినా పనులు జరగడంలేదని ఎంపీటీసీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్ అన్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే పనులు చేయాలని డిమాండ్ చేశారు.దీంతోపాటు ఇతర సమస్యలు మాట్లాడిన అనంతరం జయమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ చర్చించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసు కువెళ్లి పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటా మన్నారు. అధికారులు లేవనెత్తిన అంశాలను మళ్లీమళ్లీ అడగకుండా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ ఎంపీపీ నీలం మోహన్, ఎంపీడీవో వసంతలక్ష్మి, ఎంపీఓ ఉషా కిరణ్, మిషన్ భగీరథ డీఈఈ జగన్మోహన్రెడ్డి, పీఆరీడీఈఈ సంజీవరెడ్డి, ఎంపీటీసీలు చెక్కల ఎల్లయ్య ముదిరాజ్ సంగీత సిద్దేశ్వర్, గౌతమి అశోక్, పి.యాదయ్యగౌడ్, పంచులు రాజకుమార్ సుజాత, వి, సతీష్, కె.లక్ష్మయ్య, చెక్కల చంద్రశేఖర్, నరసమ్మ, హస్లీ రాములు, రేణుకరాజు, కల్పనా సింహారెడ్డి, దేవా నాయక్,సిద్ధులు, మహేందర్‌రెడ్డి, కె. మాధవి, అధికారులు సూర్యనారాయణ,యాదగిరిరెడ్డి, ప్రతిభ, సునీత, అహల్య, ప్రభాకర్, లక్ష్మీనారాయణ, సంధ్యారాణి పాల్గొన్నారు.