Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ
- బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగం కుదేలు
- ప్రభుత్వ భూములు ఆక్రమిస్తాం
- ఆ భూముల్లో ఎర్రజెండాలు పాతుతాం
- ఇప్పటికే భూపోరాటాలు ప్రారంభమయ్యాయి
- సీపీఐ(ఎం) నాయకత్వంలో గుడిసెలు వేస్తున్న పేదలు
- వెల్నినేడులో పాషా, నరహరి వర్థంతి
- వెల్నినేడు గ్రామ అమరుల పాటల సీడీ ఆవిష్కరణ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దోపిడీ, పీడన ఉన్నంతకాలం ఎర్రజెండా బతికే ఉం టుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ అన్నారు. బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగం కుదేల యిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలా లు, సాగుభూములు పంపిణీ చేయకపోతే ఎర్రజెండా నాయకత్వంలో ప్రభుత్వ భూములు ఆకర్షిస్తామన్నారు. ఆ భూముల్లో గుడిసెలు వేస్తామని స్పష్టం చేశారు. ఇబ్రహీం పట్నం మండల పరిధిలోని వెల్నినేడులో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అమరవీరుల సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్నినేడు గ్రామ అమరవీరుల పాటల సీడీని ఆవిష్కరించారు. అంతకు ముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. తరతరాలుగా దోపిడీకి గురవుతున్న పేదలను అక్కున చేర్చుకొని ఎర్రజెండా వారి తరఫున ఉద్య మిస్తున్నదని గుర్తు చేశారు. దున్నేవానికే భూమి కావాలని, పెట్టి చాకిరి నశించాలన్న ఎర్రజెండా నాయకత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిన పోరాట గడ్డ ఇబ్రహీంపట్నం అన్నారు. ఈ ప్రాంతంలో ఎర్రజెండా నాయకత్వంలో అనేక భూ పోరాటాలు కొనసాగాయని గుర్తు చేశారు. వేల ఎకరాలను పేదలకు పంపిణీ చేశామ న్నారు. కానీ ఆ భూములను ప్రభుత్వాలు పలు పరిశ్రమల పేరుతో వెనక్కి తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్లో కోటీ విలువ చేసే ఎకరా భూమిని ప్రభుత్వం కేవలం రూ.13 లక్షలు మాత్రమే రైతుకు పరిహారంగా చెల్లిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకున్న భూమికి మూడింతల నష్టపరి హారం చెల్లించాలని చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని అమలు చేయకపోగా నామమాత్రపు నష్టపరిహారం అందజేస్తూ పేదలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండి పడ్డారు. తర తరాలుగా దోపిడీ, పీడనతో నలిగిపోతున్న పేదలు ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వలన మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పేదల పక్షాన సమరశీల పోరాటా లు నిర్వహించినందుకే సీపీఐ(ఎం) ముందు బాగానే నిలుస్తున్నదన్నారు. పేదలకు నాయకత్వం వహిస్తున్న సీపీ ఐ(ఎం)లో వెనక్కి కొట్టాలంటే, భూస్వామ్య, పెట్టుబడిదా రులు పాషా, నరహరిలను అతి కిరాతకంగా 33 ఏండ్ల క్రితం హత్య చేశారన్నారు. వారి అమరత్వంతో భూ పోరా టం మరింత ముందుకే సాగుతున్నదని తెలిపారు. కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థల ను విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు చేయడం లేదని అన్నారు. బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తులకు సీపీఐఎం మద్దతు ఇస్తున్నదని చెప్పారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని ఓడించి తీరుతామని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీిఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నప్పటికీ పే దల పక్షాన, వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమా లలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఎలిమినేడులో ఏరోస్పేస్ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న సుమారు 700 ఎకరాల భూములకు నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదన్నారు. స్థానిక ఎమ్మెల్యే రైతుల పక్షాన నిలిచి మూడింతల నష్టపరిహారం అందించే విధంగా కృషి చేయాలని సూచించారు. లేకుంటే ఆ భూములను కూడా ఆక్రమించడానికి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రం లో మాజీ శాసనసభ్యులు మస్కు నర్సింహ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసేందుకు పాలక పక్షం అడ్డుకుంటున్న దన్నారు. అదే విధంగా గ్రామంలో భూ పోరాటం నిర్వహిం చి 700 ఎకరాలు పేదలకు పంపిణీ చేసిన భూ పోరాటం లో పాల్గొన్న 17 మంది అమరుల స్మారక స్థూపాన్ని నిర్మించుకునేందుకు ముందు అనుమతి ఇచ్చిన పాలకపక్షం తర్వాత దాని అడ్డుకోవడం సబబు కాదన్నారు. అమరుల స్థూపాలను నిర్మించేందుకు అడ్డుపడవద్దని కోరారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే భూపోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే అబ్దుల్లాపూర్‌మెట్, కందుకూరు, మహేశ్వరం ప్రాంతాల్లో భూ పోరాటాలు ప్రా రంభమయ్యాయని అన్నారు. పేదలు సీపీఐ(ఎం) నాయక త్వంలో గుడిసెలు వేస్తున్నారని గుర్తు చేశారు. పాషా, నరహరి ఆశయ సాధనకు, వారి స్ఫూర్తితో భవిష్యత్తు పోరా టాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి కాడిగళ భాస్కర్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో ఎర్రజెండా నాయకత్వంలో భూ పోరాటాలు ప్రారంభమయ్యాయన్నారు. కేవలం పేదల పక్షాన ప్రశ్నించే గొంతుకగా నిలిచే పార్టీ కేవలం ఎర్రజెండా మాత్రమే అన్నారు. సమైక్య జీవుల హక్కుల సాధనకు నిరంతరం ఉద్యమిస్తామని చెప్పారు. ప్రజా సమస్యలు ఉన్నంతవరకు ఎర్రజెండా ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమ లు నెలకొల్పేందుకు ప్రభుత్వం కేవలం పేదల భూములు మాత్రమే తీసుకుంటున్నారని గుర్తు చేశారు. భూస్వాములు, ధనికుల భూములను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వేల ఎకరాల భూములు కోల్పోయిన రైతులు నిర్వాసితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పక్కనే ఫార్మసిటీలోనూ 20వేల ఎకరాల భూములు ప్రభుత్వం తీసుకున్నదన్నారు. కడు పేదరికంలో మగ్గుతున్న రైతులు మాత్రమే నిర్వాసితులయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా పరిశ్రమలు నెలకొల్పుతున్నప్పటికీ అక్కడ స్థానికులకు ఉద్యోగాల కల్పన లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇచ్చిన స్వీపర్ల ఉద్యోగాలు కల్పిస్తున్నారన్నా రు. ఎందుకు టెక్నికల్ ఉద్యోగాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అందుకు ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసి టెక్నికల్ ఉద్యోగాల కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో పరిశ్రమలు వస్తున్న ఆ పరిశ్రమ ల్లో స్థానికేతరులతోటే ఉద్యోగాలు ఇస్తున్నారన్నారు. భవి ష్యత్తులో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం స్థానిక పరిశ్రమల్లో 50శాతం స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాల ని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల సాధనకు నిర్వహించిన పోరాటాల్లో నాయకత్వం వహించిన సుమారు 17 మంది అమరుల త్యాగాలతో కూడిన పాటల సీడీిని నాయకులు ఆవిష్కరించారు. సీపీఐ (ఎం) మండల కార్యదర్శి సిహెచ్ జంగయ్య అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యద ర్శి వర్గ సభ్యులు సామెల్, పి.యాదయ్య, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పి.జంగారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జగన్, రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు రామ కృష్ణారెడ్డి, ముసలయ్య, మహిళా సంఘం జిల్లా అధ్యక్షుడు జయమ్మ, ఉపాధ్యక్షురాలు మస్కు అరుణ, గ్రామ పార్టీ కార్య దర్శి మల్లేశా, నాయకులు బుట్టి బాలరాజు, ప్రజా నాట్య మండలి, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, కేవీపీఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.