Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
'మన ఊరు- మనబడి' పనులను 31వరకు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె. నిఖిల అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్ ఈఈ లు, డీఈలు, ఏఈలతో 'మన ఊరు - మన బడి' పనుల పురోగతిపై మండలాల వారిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'మన ఊరు-మన బడి' పనులను ఈనెల 31 వరకు పూర్తి చేసి పెయింటింగ్ పనులకు సిద్ధం చేయాలని అన్నారు. ఇప్పటి వరకు ఇంకా గ్రౌండ్ కానీ ఎన్ఆర్ఈజీఎస్ పనులను తక్షణమే గ్రౌండ్ చేసి కిచెన్ షెడ్స్, మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణపు పనులను వెంటనే చేపట్టి అట్టి పనుల ఫోటోలు తీసి తన వాట్సాప్‌కు పంపించాలని కలెక్టర్ ఆదే శించారు. పనులను నవంబర్15 వరకు పూర్తి చేయాలని సూచించారు. చేపట్టే పనులన్నీ నాణ్యతగా ఉండాలని, ఇట్టి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుం దని, పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. అవసరమైన సిమెం టు ఇసుక అందిస్తామని, ఇందుకు గాను తాండూర్ బషీ రాబాద్, పెద్దముల్ తహసీల్దార్లను ఎప్పటికప్పుడు సంప్ర దించాలని సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులకు వెం టనే ఎస్టిమేట్లు, ఎఫ్టీఓలు అప్లోడ్ చేయాలని సూచిం చారు. ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే ఇక్కడే పరిష్కరించుకొని వెళ్లాలన్నారు. ఇక నుండి ప్రతీ శుక్రవారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎంఈఓలు క్షేత్రస్థాయిలో ఇట్టి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఎఫ్ఎల్ఎన్ ( తొలిమెట్టు) కార్యక్ర మం కింద 5వ తరగతి స్థాయి వరకు గల విద్యార్థులకు విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక తరగతులు నిర్వహించి చదవడం, రాయడంతో పాటు వారి పరిజ్ఞానం మెరుగుపడేలా చర్యలు చేపట్టాలన్నారు. మండల స్థాయి విద్యాధికారులు తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులతో విద్యార్థులకు మంచి విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇక నుండి పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్య లో ప్రతి విద్యార్థి పురోగతిని పరిశీలిస్తామన్నారు. నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక దేవి, వివిధ శాఖల ఈఈలు, డీఈలు, ఏఈలు, ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు.