Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
నవంబర్ 4, 5 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే మిడ్ డే మిల్స్ వర్కర్స్ ఫెడరేషన్ రెండవ జాతీయ మహాసభలు విజయవం తం చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ అన్నారు. ఆదివారం కాటేదాన్‌లోని రం గారెడ్డి జిల్లా సీఐటీయూ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాజుతో కలిసి జాతీయ మహాసభల వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు ప్రధాన నాయ కత్వం మొత్తం ఈ జాతీయ మహాసభలో పాల్గొంటున్నారని స్పష్టం చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో ఆ సమస్యల పరిష్కారానికి చేయాల్సిన పోరా టం గురించి ఈ జాతీయ మహాసభల్లో ప్రధానంగా చర్చిస్తారని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ జి.కవిత, మధ్యాహ్నం భోజనం కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వై.స్వప్న, రంగారెడ్డి జిల్లా సీఐటీయూ నాయకులు జే.రుద్రకుమార్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.