Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- శంషాబాద్
కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మి కులు, ప్రజలకు సహాయ సహకారాలు అందిం చి గొప్ప మానవత్వాన్ని చాటుకున్న శంషాబా ద్లోని ఆర్బినగర్ కాలనీ చెందిన దోసపాటి హెర్మన్ను హ్యుమానిటీ ఎక్స లెన్స్ అవార్డు-2022 వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ఆధ్వర్యంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు ఇటీవల జరిగిన కార్యక్రమంలో అవార్డును అందజేశారు. యునైటెడ్ నేషన్స్ డే సెలబ్రేష న్స్ అండ్ నేషనల్ పీస్ కాన్ఫరెన్స్లో భాగంగా ఈనెల 27న గుం టూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఈ సంవత్సరంలో ఉత్తమ మానవతా దృక్పథం కలిగి కరోనా పాండమిక్ సమయంలో ప్రజలకు సేవలు అందించినందుకు మానవతావాదులను గుర్తించిం ది. ఇందులో భాగంగా హెర్మన్ చేసిన కృషిని గుర్తించి అభినందిస్తూ అవార్డును అందజేసింది. ఆయన చిన్ననాటి నుంచి మానవతా దృక్పథంతో పలుసేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వేసవిలో చలివేంద్రాలు, చలికా లంలో నిరుపేదలకు దుప్పట్లు, ఆహార పంపిణీతో పాటు వలస కార్మికులకు ఆహార పదార్థాలు తాగునీరు అందిం చారు. ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేసినం దుకు ఆయనను వారు గుర్తించారు. ఈ సం దర్భంగా ఆయన ఆదివారం శంషాబాద్లో మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గుర్తించి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నా రు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలతో పేద ప్రజలను ఆదుకోవ డానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూఎన్ఓ ఇండియా అంబా సిడర్ గాజులపల్లి గోపికృష్ణ, ప్రదీప్తి, డబ్ల్యూహెచ్ ఆర్సీ జాతీయ అధ్యక్షులు రావూరి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.