Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం(ఏఐకేఎస్) జిల్లా నాయకులు తావు నాయక్
- రైతు సంఘం మండల నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ - మాడ్గుల
నవంబర్ 2న రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ గ్రామంలో జరిగే రైతు సంఘం జిల్లా మహాసభలను రైతులంతా పాల్గొని జయప్రదం చేయాలని సంఘం జిల్లా నాయకులు తావు నాయక్ కోరా రు. మాడ్గుల మండల కేంద్రంలో రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా నాయకులు తావునాయక్ హాజరై మాట్లాడారు.. ప్రభుత్వం ధరణి వెబ్సైట్ తెచ్చిన తర్వాత భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించినా సమస్యలు పరిష్కారం గాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని అన్నారు. ధరణి పేద రైతులకు ఊరితాడుల తయా రైందన్నారు. మాడుగుల ప్రాంతంలో పత్తి ప్రధాన పంట అని తెలిపారు. ఈ పంట మీదనే రైతులు ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అయితే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పత్తి పంటలు వేసినప్పటికీ భారీ వర్షాల కారణంగా పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిని పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదన్నారు. పత్తి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా పత్తి క్వింటలుకు రూ. 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కేంద్రాలు ప్రారంభించాలని, పంటకు కనీసం మద్దతు ధర కల్పించాలని కోరారు.
రైతు సంఘం మండల కమిటీ ఎన్నిక
రైతు సంఘం మండల కమిటీ ఎన్నికున్నారు. అధ్యక్షులుగా పల్లెటి బుచ్చయ్య, కార్యదర్శిగా ఎస్ డి నబి, ఉపాధ్యక్షులు గా బుర్రి వెంకటయ్య, సహాయ కార్యదర్శిగా కాటం రాజు, ఈర్ల నర్సింహా,చాట్ల నర్సింహా,కట్ట నరేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.