Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి
నవతెలంగాణ- కొడంగల్
ప్రజా ఆస్తుల రక్షణ, సంఘ విద్రోహ కార్యకలాపాలను అరికట్టే క్రమంలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలు మరువలేనివని పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్స వాలలో భాగంగా ఆదివారం కొడంగల్‌లోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడంగల్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, అత్యవసర పరిస్థితిలలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు. ప్రమాదాలలో తీవ్ర రక్తస్రావాలతో దావఖానాల కు వెళ్తున్న వారికి సరైన సమయంలో రక్తం అందితే ప్రాణాలు నిలుస్తాయని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా, బాధ్యతతో రక్తదానం చేయాలన్నా రు. రక్తదానం చేయడం ద్వారా చాలామంది ప్రాణాలు కాపాడిన వారవుతారన్నారు. రక్తం కొరత వలన ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి వారందరికీ రక్తదాతలు ఇచ్చే రక్తం సంజీవని అని అన్నారు. 104 మంది రక్తాన్ని అందించేందుకు ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు. రక్తదానం చేసిన వారికి డీఎస్పీ సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ సీఐ బి.శంకర్, ఎస్సై రవిగౌడ్, దౌల్తాబాద్ ఎస్సై రమేష్‌కుమార్, బోంరాస్పేట్ ఎస్సై, పరిగి సీఐ, దోమ ఎస్ఐ విశ్వజన్, తదితరులు పాల్గొన్నారు.