Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ కుట్రలు, కుతంత్రాలు సాగవు
- బీజేపీలో చేరేందుకు ఎవరూ సిద్ధంగా లేరు
- బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలను కొనడం కాదు, దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి చూపించాలి
- మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం
- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి
నవతెలంగాణ-పరిగి
టీఆర్ఎస్ని విడిచే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పరిగి పట్టణ కేం ద్రంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'బీజేపీ నాయకులు నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు సంబంధించిన ఎపిసోడ్లో పోలీసులు సమాచారం అందుకొని వారి బండారాని బట్టబయలు చేశారు. ఆ నలుగురిలో నందకుమార్ అనే వ్యక్తి ఎవరో తెలియదు. నందకుమార్ పరిగి ప్రాంతం దోమ మండలం మోత్కూర్ గ్రామానికి చెందిన వాడని చెప్తున్నారు కానీ ఇక్కడ ఎక్కడ ఉన్న దాఖలాలు లేవు. నాతో పరిచయం కానీ, నాతో కలిసి కలిసిన సందర్భం కానీ, 30 ఏండ్లలో నాతో ఫోన్లో మాట్లాడిన సందర్భం కూడా లేదు. అవసరమైతే నా కాల్ డేటాను కూడా చెక్ చేసుకోవచ్చు.. మా నాన్న 30 ఏండ్లు టీడీపీలో ఉండి ఐదుసార్లు శాసనసభ సభ్యునిగా ఎన్నిక య్యారు. 2010లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొన సాగుతున్న సమయంలో టీఆర్ఎస్లో చేరాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఎంతో మంది టీఆర్ఎస్లో చేరారు' అని ఎమ్మెల్యే వివరిం చారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూలదోసి ఏదో రకంగా అధికారంలోకి రా వాలని చూస్తుందని విమర్శించారు. మతం పేరుతో రాజ కీయాలు చేస్తూ, రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కొని ప్రభుత్వాన్ని కులదోయాలని చూస్తోందన్నారు. బీజేపీ ఆటలు తెలంగాణలో కొనసాగ వని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచే స్తామని, గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ టీఆర్ఎస్లో కొనసాగుతామని స్పష్టం చేశారు. మునుగోడులో బీజేపీ ఓడిపోతుందని, అందుకనే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తన సభను రద్దు చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీ నాయకులను కొనుగోలు చేయడం కాదు దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి ప్రజల మన్నలను పొందాలని సవాల్ చేశారు. ఎవరో బ్రోకర్లను మధ్యలో పిలిపించి అంద రిని ఇబ్బందులు పెట్టి, బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నా రని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు ఎన్నటికీ సాగవని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి, పీఏ సీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, టీఆ ర్ఎస్ పరిగి మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సర్పం చులు వెంకటయ్య, రాములు, ప్రవీణ్, పార్టీ నాయకులు మీర్ తాహిర్ అలీ, రవి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.